Thursday, May 28, 2009

మరోసారి మొండిచేయి

జాతీయ పార్టీని ఎన్నుకుంటే జరిగేదేమిటో నాలుగు రోజుల్లోనే అనుభవంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజల పట్ల తనకు ఉన్న చులకన భావం మరోసారి చూపించింది. 33 మంది ఎంపీలను గెలిపించి పంపిస్తే మనకు సహయమంత్రి పదవులు విదిలించింది. తమిళనాడు, కర్ణాటకలు కేంద్రానికి ఇచ్చింది తక్కువమంది ఎంపీలనైనా ముఖ్యమైన శాఖలు వారు దక్కించుకుంటే, మనవాళ్ళు సహయమంత్రులుగా పదవి ఇచ్చామని మన్మోహనుడు ఫోన్ చేసి చెప్తే ఆనందంతో పొంగి పొర్లుదండాలు పెట్టేస్తున్నారు. ఇలా జరగటం ఇది రెండోసారి. గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్రదేశంలో రాజీవ్, ఇందిరల నామస్మరణ మారుమ్రోగింది. తెలుగువారిలో గుర్తుంచుకోదగ్గ నాయకులు లేరని, ప్రతి పధకానికీ కాంగ్రెస్ వాళ్ళ అమ్మ మొగుడి పేరు పెట్టుకుంటూ అతి విశ్వాసం చూపిస్తేనే రాలిన మెతుకులివి.

ఇలా చెయ్యటం వాళ్ళకి కొత్త కాదు, మనకు అంతకన్నా కొత్త కాదు. జాతీయ పార్టీలలో రాష్ట్రనాయకులు ఏది కావాలన్నా అధిష్టానాన్ని దేబిరించాలే కానీ డిమాండ్ చెయ్యలేరు. చేస్తే ఉన్న పదవి పోయి పార్టీలో ఉన్న మన ప్రత్యర్థి వర్గాన్ని వరిస్తుంది. రాజశేఖరుడు మన రాష్ట్రం నుండి 33 మంది ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపించింది, మేడం తనను ముఖ్యమంత్రిగా పీకేసి ఇంకో గన్నాయిగాడిని పెట్టకుండా ఉండటానికే కానీ అంతకుమించి మనకేమి తెప్పించటానికి కాదు. ఈసారి ఎలాగూ పూర్తి మెజారిటీ రాదనుకుని ఎన్నికలయ్యాక కడపకి పోయి కూర్చుని, రాజధాని కలరాతో ఏడుస్తున్నా నాకేం సంబంధం లేదన్నట్టు సమీక్షా సమావేశాలు నిర్వహించుకుంటూ వున్నారు మన రాజావారు. తీరా గెలిచేసరికి ఆనందంతో తబ్బిబ్బయిపోయి ఈ ఆనందం చాలు మాకింకేమి అక్కర్లేదు, ఇంకా ఎక్కువిస్తే మా వాళ్ళకు గుండె ఆగిపోవచ్చు, ఇక్కడ మా వేషాలు చూసీ చూడనట్టు వదిలేసి, అప్పుడప్పుడు వచ్చి పొగడటానికి మాత్రమే ఇంతమంది ఎంపీలను పంపుతున్నాను అని చెప్పినట్టున్నారు అధిష్టానానికి. రేపెప్పుడైనా అధిష్టానం కళ్ళెర్రజేస్తే, మీ కోసం ఇంతమందిని గెలిపించాను, మాకు రావలసిన పరిశ్రమలు, రైళ్ళు, రోడ్లు అన్నీ వదులుకున్నాను, మీ సేవకి మావాళ్ళని సహయమంత్రులుగా పెట్టాను, ఇంత కష్టపడి ఇన్ని త్యాగాలు చేస్తే నాకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని, పాత సినిమాల్లో భార్యలు భర్తల్ని నిష్టూరమాడినట్టు, అధిష్టానాన్ని సెంటిమెంట్ డైలాగులతో కొట్టొచ్చు.

ఈ జాతీయ పార్టీలను గెలిపించినంత కాలం మన పరిస్థితి ఇంతేనేమో. తమిళనాడు తరహాలో జాతీయ పార్టీలను భూస్థాపితం చేసేసి, ప్రాంతీయ పార్టీలను ఎన్నుకుని, తమకు రావలసినవి డిమాండ్ చేసే పరిస్థితిలో ఉండటం తప్ప దక్షిణాది రాష్ట్రాలకు వేరే మార్గం లేదు. ఆంధ్రాలో ఆ పని అన్నగారు మొదలుపెట్టి సగం పూర్తి చేసారు, మిగతా పని పూర్తి చెయ్యటానికి "అన్నయ్య" వస్తాడనుకుంటే, ఆయన మొదట్లోనే పూర్తిగా చతికిలబడ్డాడు. బలమైన ప్రాంతీయ పార్టీ ఒక్కటే అవ్వటంతో, అది నచ్చనప్పుడల్లా మళ్ళీ కాంగ్రెస్‍ని ఎన్నుకుని ఇలా ఢిల్లీ వంక చూస్తూ, వాళ్ళు మనకు తప్ప అందరికి పంచుతున్నవి చూసి గుటకలు మింగటం వినా వేరే దారి కనపడదు. మెల్లగా ప్రజారాజ్యం పుంజుకుని, వున్న రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ కాంగ్రెస్ లాంటి పార్టీలకు చోటివ్వకూడదని నా ఆశ. నా ఆశేగానీ జరుగుతున్నవి చూస్తుంటే వచ్చే ఎన్నికలకి ప్రజారాజ్యం అనే పార్టీ వుంటుందో లేదో అని అదో అనుమానం. మిగతా పని పూర్తి చెయ్యటానికి మళ్ళీ అన్నగారే పుట్టాలి కాబోలు.


18 అభిప్రాయాలు:

పద్మనాభం దూర్వాసుల said...

మీ అపోహ కాని, మనవాళ్ళకు ఏ మంత్రిపదవులిచ్చినా మనకు ఒరిగేదేమీ లేదు.మనకు మిగిలేది "మొండి చెయ్యే" వారానికి ఒకసారైనా అమ్మ దర్శనం చేసుకొని దక్షిణ తాంబూలాలు సమర్పించడం తప్ప ఇంకేం చెయ్యగలరు? ఇక ప్రజారాజ్యమా, దాని పుట్టుకే బాగులేదు. దానికి ఆశ తప్ప ఆలోచన లేదు.

నాగప్రసాద్ said...

>>"మెల్లగా ప్రజారాజ్యం పుంజుకుని, వున్న రెండు ప్రాంతీయ పార్టీలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ కాంగ్రెస్ లాంటి పార్టీలకు చోటివ్వకూడదని నా ఆశ".

Let's hope so.

Anonymous said...

hai chaitanya ,
naa profile name kuudaa chaitanyam. My name is Krishna chaitanya. I am a SRF at university of hyderabad in organic chemistry. What about you? R u in pharma industry?

Anonymous said...

Good post. Excellent analysis. I agree 100%.

చిలమకూరు విజయమోహన్ said...

ఎలక్షన్లకు ముందు మ్రొక్కులేమో ఏడుకొండల గోవిందునికి,
గెలిచిన తర్వాత కృతజ్ఞతలేమో జెరూసలేము ప్రభువుకు పల్లకీ మోసే బోయీలే మన ఎంపీలు పల్లకీలో కూర్చునే అర్హత మాత్రం ఎప్పుడూ తమిళతంబీలకు, బెంగాలీబాబులకే.

Anonymous said...

quite biased opinion to say the least...of course its out of emotional attachment with AP:)...

let me put it this way...tell me a few good politicians who could take up cabinet roles in center...I said good politicians..

I don't mean that all the cabinet ministers are good politicians...but there is a chance to be a cabinet minister if someone is a good politician... which AP lacks whether we like it or not:)...

చైతన్య కృష్ణ పాటూరు said...

@athmakatha,
నా అభిప్రాయంలో ఎమోషన్ ఏమోగానీ, మీ అభిప్రాయంలో మాత్రం నాకు అమాయకత్వం కనపడుతోంది. గత ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న DMK రాజాకి మళ్ళీ అదే మంత్రి పదవి కట్టబెట్టారు. వీధి గూండా లాంటి అళగిరికి కేబినెట్ పదవి ఇచ్చారు. వీరితో పోలిస్తే మన రాష్ట్రంలో మెరుగైన వారు లేరా. ఇంతవరకు ఉభయ సభల్లో దేంట్లోకీ ఎన్నికవ్వకుండానే విలాశ్‍రావ్ దేశ్‍ముఖ్ భారీ పరిశ్రమల శాఖ దక్కించుకున్నారు. క్రితంసారి ముఖ్యమైన సమస్యల్ని లేవనెత్తి స్పీకర్ ప్రశంసలు అందుకున్న పురంధరీశ్వరికి ఈసారి మెరుగైన అవకాశం ఇస్తారనుకుంటే, మళ్ళీ అదే ఏడుపు. మన రాష్ట్ర కోటా నుంచి రాజ్యసభకు ఎన్నికైన కర్ణాటకకు చెందిన జైరాం రమేష్ క్రితంసారి సహయమంత్రిగా ఉండి ఈసారి స్వతంత్ర హోదా గల పదవి దక్కించుకుంటే, మనవాళ్ళకేమో ఏ స్వతంత్ర ప్రతిపత్తీ లేని సహయ మంత్రి పదవులు దక్కాయి.

కామేష్ said...

చాలా మంచి టపా. ఇంచుమించుగా నా అభిప్రాయాలు కూడా ఇలాంటివే. రాబోయే రోజుల్లోనైనా మరో ఈ జాతీయ పార్టీ భూస్ధాపితి అయిపోయి, ప్రాంతీయపార్టీల ప్రాభవం, మరీ ప్రత్యేకంగా లోక్ సత్తా లాంటిది రావాలని మనసారా మంచిరోజుల కోసం ఎదురుచూస్తున్నా.

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం said...

Don't worry. జాతీయతే భూస్థాపితమయ్యే రోజులొస్తున్నాయి. ఇహ జాతీయపార్టీల సంగతి చెప్పేదేముంది ?

ఇహపోతే ఇక్కడ/ అక్కడ కాంగ్రెస్ గెలుపు - ప్రజలు అనుకున్నదీ కాదు, కాంగ్రెస్ అనుకున్నదీ కాదు. కనుక ఈ గెలుపు శాశ్వతం కాకపోవచ్చు.

Venky said...

Dear.. Chaitanya Krishna.. Your post is showing complete ignorance than any "Chaitanyam". You are completely jealous of the present govt and policy makers who are elected by the people of India. The so called opposition leader has shown all his gimmicks to become next CM for the state of Andhra Pradesh. People out rightly rejected his leadership and elected YSR as CM.As far as Central MInister portfolios are concerned.. you just tell me one leader who is so famous in dealing external affairs/finance ministries, Home ministries in the center from the state of Andhra Pradesh. Even though Tamilnadu Congree MP candidates are very less in parliament Chidambaram became Home Minister. He has such capacity. Similarly the case of Pranab Mukharjee, who belongs to the state of West Bengal, where Congress does not have much existaence, he became Finance minister.. because of his talent. One should acquire such capability by showing his wisdom, knowledge, addressing grievances of the people in parliament etc. Then only we can expect such Ministries for the state of Andhra pradesh. Not just for the sake of 33 MP's.
With Best Wishes,
venky

చైతన్య కృష్ణ పాటూరు said...

@venky,
వైయస్‍ని విమర్శించాను కదా అని నేనేదో ప్రతిపక్ష నాయకుడి అభిమానిననుకుని ఉడుక్కుంటున్నట్టున్నారు. గెలవటానికి ప్రతిపక్షనేత చేసిన జిమ్మిక్కులు, కొట్టిన పల్టీలు అందరికీ తెలుసు. అందుకు వాళ్ళ పార్టీ అభిమానులే విమర్శిస్తున్నారు. కానీ సమైఖ్య రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి గెలుపు రాదేమోనని భయపడి రెండు ప్రాంతాల మధ్య మంటలు ఎగదోసే ప్రకటనలు చేసిన దిగజారుడుతనం ముందు అవన్నీ ఎంత. మీ అభిమాన నాయకుడ్ని జనం గెలిపించారని ప్రకటిస్తున్నారు కానీ ఈసారి అసెంబ్లీలో అధికార పక్షానికి దాదాపు సమాన సంఖ్యలో విపక్షాలు కూర్చోవటమే చెప్తోంది ఇది ఏపాటి గెలుపో. చావు తప్పి కన్నులొట్టపోయినట్టు గెలిచిన ఈ నాయకుల మీద అసూయ పడటం కూడానా.

కేంద్ర మంత్రి పదవులంటే మీరు చెప్పిన హోం శాఖ, ఆర్థిక శాఖలు మాత్రమే కాదు. అవి ఇవ్వమని ఎవ్వరూ అడగట్లేదు కూడా. ముప్పైమూడు కేబినెట్ పదవుల్లో మనకివ్వటానికి ఒక్కటీ లేదా? కేవలం ప్రాంతీయ పార్టీలయినందుకు మిగతా పార్టీలు నేర చరితులకు కూడా నిధులున్న మంత్రి పదవులు ఇప్పించుకోగలిగాయి, కానీ మనవాళ్ళకు మాత్రం ప్రతిసారీ సర్దుకోమనే చెప్తోంది. అసలు ఎప్పుడైనా అవకాశం ఇస్తే కదా సమర్థత నిరూపించుకోవటానికి. కనీసం స్వతంత్ర హోదా గల సహాయా మంత్రి పదవులు కూడా ఇవ్వరు ఇంక నిరూపించుకునేదెట్లా?

Suneel Vantaram said...
This comment has been removed by the author.
Suneel Vantaram said...

ఛైతన్య గారు, మీ పోస్ట్ బాగుందండి. నేను చదవటమే కొంచెం లేటనుకుంటా, ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. ఇక పోతె, వెంకీ గారు, మిమ్మల్ని ప్రతిపక్ష నాయకుడి అభిమాని అనుకున్నారో లేక ఆయనే "రాజా"గారి ఏ.సి (ఫ్యాన్ కన్న కొంచెం ఎక్కువ లెండి) అయి ఉండవచ్చు.
@వెంకీ గారు, పోని మీరన్నట్టు మన నాయకులకు సమర్ధత లేదనుకుందాం (ఉందని ఎవడూ చెప్పడు లెండి), మరి రైలు బడ్జెట్టు లాంటి వాటిల్లో కేటాయింపులు అయినా మనకి దయ చూపరేమి?
మళ్ళీ నెను కూడ ఎదో పార్టి మనిషిని అనుకునేరు..నేనేదో సగటు మనిషిని.

Telugu4u said...

Good Piece of Information Telugu Blogs Baaga ne Maintain Chestunnaru Keep it Up

Teluguwap,Telugu4u

Tollywood,Tollywood Updates , Movie Reviews

GARAM CHAI said...

nice post
Hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

తెలుగురీడ్స్ said...

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్

Telugunetflix said...

https://www.telugunetflix.com
https://www.telugunetflix.com
https://www.telugunetflix.com

quanellefacciolo said...

Wynn Las Vegas and Encore Resort Casino - JSH Hub
Wynn Las Vegas and Encore 논산 출장샵 Resort 춘천 출장샵 Casino. Wynn Las Vegas and Encore Resort Casino. Wynn งานออนไลน์ Las Vegas and Encore 청주 출장안마 Resort Casino. 부천 출장샵